Latest posts
-
కొన్న దగ్గర కొసరు కానీ కోరిన దగ్గర కొసరా అన్నట్టు
ఒకరిని యాచించేటప్పుడు లేదా కోరి అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తిపడాలి. అంతేకానీ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని కొసరటం పద్ధతి కాదు. డబ్బులు పెట్టి కొనేటప్పుడు కొసరినా బాగుంటుంది కానీ అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలన్న సామాజిక జీవన విధానాన్ని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం: eenadu.net
-
కళ్లు మూయవచ్చుగానీ…
బలవంతంగా ఎవరిచేత ఏ పనీ చేయించలేము అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఎవరైనా కలలు కనాలంటే వారి మానసిక స్థితి ఆ కలలకు సంబంధించినదిగా ఉండాలి. అంతేగాని కళ్లు మూసుకొని నిద్రపోతే కలలు వస్తాయి కదా అనుకొని అందరినీ కళ్లుమూసుకోండి కలలు కనండి అని బలవంతపెడితే కళ్లు మూసుకుంటారేమో కాని కలలు కంటారన్న మాట మాత్రం సత్యదూరంగానే ఉంటుంది. ఈ భావన ఆధారంగానే ఏ వ్యక్తి చేత కూడా బలవంతంగా ఏ పని…
-
మొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదు
మానవ మనస్తత్వాల విశ్లేషణ చేసే జాతీయాలలో ఇది కూడా ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారు ఎగ్గును లెక్కచేయరు. ఎగ్గు అనంటే కీడు అనర్థం. మొరటుగా ఆలోచించేవారు తమకు కీడు కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారన్నది భావన. ఆ భావనల ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ీమొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదన్నట్టుంది నీ ప్రవర్తన. దాన్ని…
-
గోడకేసిన సున్నం
మనం ఏదో ఆశించి వెచ్చించేవాటిలో కొన్నిసార్లు ఆ వెచ్చించిన ధనం ఇక ఏపరిస్థితులలోనూ వెనక్కిరాదనుకున్నప్పుడు ఉపయోగంచే జాతీయమిది. తిరిగిరాని పెట్టుబడిని గోడకు వేసినసున్నం అంటుంటారు. శుభ కార్యాల్లాంటి సందర్భాలలో ఇళ్ళ గోడలకు వెల్లవేస్తుంటారు. అలా వెల్లవేసేటప్పుడు ఉపయోగించే సున్నం అంతకుముందు రాళ్ళ రూపంలో ఉంటుంది. ఆరాళ్ళును నీళ్ళతో పోసి నీరు సున్నాన్ని గోడకు వేసిన తర్వాత ఆగోడలు తెల్లగా, అందంగానే ఉంటాయి. కానీ ఆ శుభకార్యాలు ముగిసిన తర్వాత మళ్ళిమన సున్నం మనకు రాళ్ళ రూపంలోనో లేదా…
-
గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు
సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ''విషయమంతా ఆయన దగ్గర చెప్పటమంటే గొర్రెలకు తోడేలును కాపలాగా ఉంచినట్టే'' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: ఈనాడు.నెట్
-
గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టు
కొంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారదు. దుర్మార్గం వైపే వారి అడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి వారిని గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనే నానుడికి సరిసమానంగా దీన్ని చెబుతారు.
-
రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు
జీవిత సత్యాన్ని తెలియచెప్పే జాతీయం ఇది. ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా అలా అనుభవించింటేప్పుడు బంధుమిత్రుల అనురాగం ఉంటేనే ఆ భోగానుభవంలో ఆనందం ఉంటుంది. కానప్పుడు ఎన్ని భోగాలున్నా, ఎదురుగా ఇంకేమున్నా ఆనందమే ఉండదు. అలాగే ఎదుటి వారికోసం చిన్నదైనా, పెద్దదైనా త్యాగం చేసినప్పుడు మనస్సుకు కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎలాంటి త్యాగమూ లేకుండా చ్కీజీజివితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.
-
అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే..
అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నది జాతీయం. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అనే దానికి సమానార్థకమిది. ఎవరూ ఎవరికంటే అధికులు కారని, తామే గొప్ప అని ఎవరూ ఎప్పుడూ గర్వాహంకారాలకుపోకూడదని హెచ్చరించే సందర్భాలలో పెద్దలు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అబ్బడు, దిబ్బడు, సుబ్బడు అనేవి తెలుగునాట గ్రామ ప్రాంతాలలో ముద్దుగా పిలుచుకునే పేర్లు. పేర్లు ఏవైనా గర్వాహంకారాలు పనికిరావన్నదే ఈ జాతీయం ఇచ్చే సందేశం.
-
ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదన్నట్టు
పులి క్రూరజంతువే అయినా రాజసం, నీతినిజాయతీల లాంటివాటికి ప్రతీకగా చెప్పుకోవటం అలవాటుగా వస్తోంది. ఆయన పులి లాంటివాడు అనంటే క్రూరస్వభావం కన్నా గాంభీర్యం ఎక్కువగా ఉన్నవాడు అనే అర్థమే స్ఫురిస్తుంది. కరవు వచ్చిన సందర్భాల్లో మిగతా ప్రాణులైతే ఏ గడ్డి అయినా తిని సరిపెట్టుకుంటాయి. కానీ పులి మాత్రం అలాకాదు. అది వేటాడి మాంసాన్నే తింటుంది కానీ గడ్డిని తినదు. గడ్డితినటం, గడ్డికరవటం అనే మాటలు అవినీతి, అక్రమాలకు పాల్పడటమనే అర్థాల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. నీతిమంతుడిని పులి…
-
కోడిగుడ్డును కొట్టేందుకు గుండ్రాయి కావాలా అన్నట్టు
అల్పులను శిక్షించేందుకు అధికమైన బలం అక్కరలేదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వాటం చూసి గట్టిగా వేలితో కొట్టినా కోడిగుడ్డు పగులుతుంది. అలాంటి దానికి గుండ్రాయి అనవసరం. అదే తీరులో అల్పుడైన శత్రువును కొట్టడానికి అధిక బలం అనవసరమని చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.