Latest posts
-
ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగుళూరు అవుతుందన్నట్టు..
చుక్కల్లో చంద్రుడులాంటిది ఇది. అన్నిటికంటే అధికం అని చెప్పే సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది. ఇటువంటి జాతీయాలు స్థానికంగా మాండలికపరంగా ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి. కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన బెంగుళూరు నగరం చాలా గొప్పది అని చెప్పటం దీనిలో పైపైకి కనిపించే విషయం. ఇద్దరు వ్యక్తుల నడుమ పుంగనూరు గొప్పదా? బెంగుళూరు గొప్పదా? అని వాదన జరిగినప్పుడు ఆవిర్భవించింది ఇది. అయితే దీన్ని విడిగా ఒక వస్తువునో, ఒక వ్యక్తినో గొప్ప అని, చాలా గొప్ప అని…
-
చేతికొచ్చింది నోటికొచ్చిందాకా నమ్మకం లేనట్టు..
స్థిరం లేని వ్యవహారం, నమ్మకంలేని పని అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేతి నుంచి నోటికున్న దూరం తక్కువే అయినా చేతిలో ఉన్నదాన్ని నోట్లో పెట్టుకొనే లోపలే అది కింద పడిపోవటమో మరోలా పనికిరాకుండా పోవటమో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పటం ఈ జాతీయంలో పైపైకి కనిపిస్తున్న విషయం. అంటే అన్ని రకాలుగా ఇది నాదేనని అనుకొని ధైర్యంగా ఉన్నప్పుడు అది తనది కాకుండా పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు అనేక…
-
చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు
హాని కలిగించని పని, కష్టం లేని పని అంటే ఆ పని చేయటానికి అందరూ ముందుకొస్తారని, శక్తిహీనులు కూడా తాము శక్తివంతులమని చెప్పుకోటానికి అలాంటి పనులకు ముందుకు వస్తారని తెలియచెప్పటమే ఈ జాతీయ లక్ష్యం. చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు ఈ చిన్నపని చేయటానికి నేనంటే నేనంటూ అందరూ ముందుకొచ్చారు అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net
-
ఈ అన్నది లేదు, తే అన్నదే తరతరాలుగా వస్తున్నది..
ఈ (ఇవ్వు) అన్నది లేదని, తే (తీసుకురా) అన్నదే అలవాటని చెప్పటం ఈ జాతీయంలో అంతరార్థం. ఇక్కడ కనిపిస్తున్న ఈ, తే అనే రెండూ రెండు విభిన్నార్థాలను కలిగి ఉన్నాయి. ఈ అంటే దయచేసి ఇవ్వు అని బతిమలాడటం లేదా యాచించటం, తే అంటే తీసుకురా అని ఆజ్ఞాపించటం అనేది అర్థం. అంటే తనకు యాచించే స్థితి ఏనాడు లేదని, ఎప్పుడూ ఒకరిని ఆజ్ఞాపించి పని చేయించుకొనే ఉన్నత స్థితేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం…
-
పూతకు ముందే పురుగు పట్టినట్టు…
పని ప్రారంభానికి ముందే విఘ్నాలు ఏర్పడటం లేదా ఆ పనికి సంబంధించినవేవైనా చెడిపోవటం అనేలాంటివి జరిగినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పువ్వు పూయాలంటే మొగ్గగా ముందు అది ఉద్భవిస్తుంది. మొగ్గ విచ్చుకొని పువ్వవుతుంది. పువ్వు పూసిన తర్వాత దానికేదైనా చీడపట్టడమో మరొకటో జరిగితే వేరే విషయం. కానీ మొగ్గ దశలోనే చీడపడితే పువ్వు పూయటం, అది అందంగా వికసించటం అనేవి జరగవు. ఈ క్రమాన్నంతటినీ పని విజయవంతమయ్యే విషయానికి పోల్చిచెప్పి పని ప్రారంభించకముందే నష్టాలు కలగటాన్ని…
-
ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అన్నట్టు..
పండుగలు జరుపుకొనే తీరును జీవన గమనానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. ఉగాది పండుగనాడు కొత్తబట్టలు, పిండివంటలతో అంతా సుఖసంతోషాలతో ఉంటారు. శివరాత్రి అంటే ఉపవాస ప్రధానమైన పండుగ. ఏవీ తినకూడదు. అంటే డబ్బులుంటే కొంతమంది ఉగాది పండుగ చేసుకున్నంత సంబరంగా కాలం గడుపుతారు. అదే డబ్బు లేకపోతే ఆకలితో మాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఉన్నప్పుడు బాగా ఖర్చుపెట్టి లేనప్పుడు కష్టాలు పడేలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ీవాడంతే ముందు చూపు ఉండదు. ఉన్నప్పుడు ఉగాది,…
-
కుక్క వేషం వేసి మొరగనంటే ఎలా?
ఒక పనిని ఒప్పుకున్నప్పుడు దానికి సంబంధించిన వాటన్నిటినీ చెయ్యాల్సిందే. సగం పనులు చేసి మిగతావి చెయ్యటం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యను అనంటే అది కుదిరేపనికాదు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఇక్కడ కుక్క అని అనడం నీచత్వానికి ప్రతీక. అవినీతిలాంటి నీచకార్యాలకు పాల్పడినప్పుడు దానికి సంబంధించిన ఏ కష్టనష్టాలు వచ్చినా అన్నిటినీ అనుభవించాల్సిందే. అలాకాక నేను చేసేది ఇంతవరకే, మిగతాదంతా రహస్యంగా ఉండాల్సిందేనని అంటే ఎవరూ ఊరుకోరు. ఈ విషయాన్ని…
-
ఎండిన మోడుకు ఎర్రని పూలు తగిలించినట్టు..
అసంబద్ధమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏ పనిచేసినా అతికినట్లుండాలని అంటారు. ఆ అతికింది సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపింపజేయటంలోనే నైపుణ్యం అంతా ఇమిడి ఉంటుంది. అలాగాక పని చేతకాకపోతే మాసికలు వేసినట్లు అతుకులు అతుకులుగా ఉంటుంది. అలా ఉండటం చూడటానికి బాగుండదని, ఆ పని అసంబద్ధంగా ఉంటుందని తెలియజెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జీవంతో ఉన్న చెట్టు మీద పచ్చని ఆకుల నడుమ ఎర్రని పువ్వులను ఉంచితే ఒకవేళ ఆ…
-
ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నట్టు..
కొంతమంది ఎదుటివారు నిందించినప్పుడు దానికి తగిన రీతిలో నర్మగర్భంగా సమాధానాలు చెబుతుంటారు. అలా మాటకు మాట అనటం కూడా ఓ గొప్ప కళ. ఒకామె మరో ఆమెనుఛీ కుక్కా పో అని తిట్టిందట. దానికి ఎదుటామె ఏమాత్రం బాధపడకుండా, ీఏమక్కా పిలుస్తున్నావు' అన్నదట. కుక్క అక్క కుక్కే అవుతుంది కానీ మరొకటి కాదు. అలా చాలా తెలివిగా ఎవరైనా ఎక్కడైనా మాటకు మాట సమాధానం చెబుతున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం: eenadu.net
-
రాగల వసంతాన్ని కాకులు ఆపుతాయా అన్నట్టు..
ఒకరి అదృష్టాన్ని మరొకరు పాడుచేయలేరని అంటారు. అలాంటిదే ఇది. రుతువుల క్రమంలో వసంత రుతువు రావటం, కోయిలలు కూయటం ఇవన్నీ మామూలే. అయితే వసంతంలో కోయిలలు కూస్తాయని అప్పుడు వాటినే అందరూ మెచ్చుకొంటారని కుళ్లుకునే కాకులు వసంతం రాకూడదు, రాకూడదు అంటూ అనుకుంటూ కూర్చున్నాయట. కానీ వసంతం రానే వచ్చింది, కోయిల కూతలు వినిపించాయి. ఇదేతీరులో శుభాలు జరగాలని రాసి ఉంటే దాన్ని ఆపడం ఎవరివల్లా కాదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మూలం:…