Latest posts
-
చవి ఎరిగిన కుక్క చావగొట్టినా పోదన్నట్టు..
కొంతమంది ఎదుటివారి ఇళ్లలో భోజనాలు చేసే సమయానికి, అల్పాహారం చేసే సమయానికి వచ్చి తిని వెళుతుంటారు. ఇలా ఒకటిరెండు రోజులైతే ఎవరూ ఏమీ అనుకోరుకానీ ప్రతిరోజు సమయం చూసుకొని కచ్చితంగా తినే వేళకు వచ్చి కూర్చోనేవారిని చూసి విసుక్కునే సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. ఒక చోట ఆహారపు రుచి మరిగిన కుక్క ఎంతకొట్టినా పోదన్నది దీని అర్థం. రోజు వచ్చి వూరకనే తినిపోయేవారిని అలాంటి కుక్కతో పోల్చి చెప్పటం ఈ జాతీయంలో విశేషం. మూలం:…
-
కాణీకి టెంకాయ ఇస్తారని కాశీదాకా వెళ్లినట్టు
కొంతమంది అత్యాశకు పోయి అధికంగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పూర్వం కాణీలు, అణాలు ఉన్న రోజుల్లో ప్రచారంలోకి వచ్చిన జాతీయమే అయినా ఈ నాటికీ చాలామందికిది వర్తిస్తుంది. కాశీ నగరంలో అయితే టెంకాయ ఒక కాణీకే ఇస్తున్నారు. తమ వూళ్లో అయితే మూడుకాణీలు పెట్టాలి అని ఒకామె కాశీదాకా బయలు దేరిందట. ఇలా వెళ్లడానికి దారిబత్తెం ఎంతో ఖర్చువుతుంది. అదంతా ఆలోచించకుండా కాశీకి వెళ్లిందామె. తిరిగొచ్చి…
-
వడ్డీ వేగానికి వడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు..
వడ్డీకి డబ్బు అప్పు తెచ్చిన వారి బాధను తెలిపే జాతీయం ఇది. వడ్డీ కట్టేశాం కదా అని అనుకొనేంతలోపే మళ్లీ నెల తిరిగి రావటం, తిన్నా తినకపోయిన అప్పులవాళ్లకు వడ్డీ కట్టడం జరుగుతుంటుంది. వడ్డీ కట్టేరోజు ఎంతో వేగంగా వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ వేగం ఎలాంటిదంటే బాగా వడిగా పరుగెత్తే గుర్రపు వేగంకన్నా ఎక్కువ వేగంగా ఉంటుందన్న భావన ఈ జాతీయ ఆవిర్భావానికి వేదిక.వడ్డీ వేగానికి వడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు కనిపిస్తోంది. మొన్నే కదా వడ్డీ కట్టాం…
-
దరిలేని బావి దాపులేని కొంప అన్నట్టు
వెళ్లటానికి సమీపంలో లేని విషయాలను గురించి చెప్పుకొనేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మనిషికి కావలసిన ప్రధాన అవసరాలలో తాగటానికి నీరు, ఉండటానికి ఇల్లు ముఖ్యమైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. బావి దగ్గరగా ఉంటే నీటి సౌకర్యం బాగా ఉంటుంది. చేసే ఉద్యోగానికో లేదా పనికో ఇల్లు దగ్గరగా ఉంటే ఎంతో అనువుగా ఉంటుంది. అలా కాకపోతే అన్నీ కష్టాలే. అలా ఏ పనిలోనైనా అసౌకర్యాలను అనుభవిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం:…
-
అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..
సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది. అయితే దీన్ని సమాజంలో ఉన్నతాధికారులకు, వారికింద పనిచేసే ఉద్యోగులకు సమన్వయిస్తూ కూడా చెపుతుంటారు. ఉన్నతాధికారులను అత్తలతో, కిందిస్థాయి ఉద్యోగులను కోడళ్లతోను పోల్చి చెప్పటమే దీనికి ఆధారం. జాతీయంలో చెప్పినట్టు వేపచెట్టుకు సంబంధించిన కాయలు తియ్యగా ఉండవు. అవి చేదుగానే ఉంటాయి. అలాగే అత్తకూడా కఠినంగా…
-
ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలియ్యమన్నట్టు..
దౌర్జన్యం చేసేవారిని పెంచి పోషిస్తూ మంచివారిని పనిచెయ్యండని ఒత్తిడి చేస్తుంటారు కొందరు. అలాంటివారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆవు సాధుజంతువు. ఎద్దును బలవంతులకు పోలికగా చెబుతారు. ఈ పోలికే ఈ జాతీయ ఆవిర్భావానికి వేదికైంది. 'ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలిమ్మన్నట్టు ఉన్నదంతా వాళ్లకే పెట్టి, చెయ్యాల్సిదంతా వాళ్లకే చేసి మమ్మల్ని చాకిరీ చేయమనటం ఏమీ బాగాలేదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net

కలిగిన వారికి అందరూ చుట్టాలే..
లోకం తీరును వివరించే జాతీయం ఇది. కలిగిన వారు అనంటే సంపదలు కలిగినవారు అని అర్థం. డబ్బు లేని పేదవాడిని ఎవరూ తనవాడు అని చెప్పుకోరు. అదే తెలిసిన వారిలో ఎవరైనా ధనవంతులో లేదా పలుకుబడి కలిగినవారో ఉంటే ఎక్కడో ఒకచోట చుట్టరికాన్ని కలుపుకొని వాళ్ళు మా వాళ్ళేనంటూ గొప్పలు చెప్పుకోవటం చాలామంది దగ్గర కనిపిస్తుంది. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మూలం: eenadu.net
-
పిలిచి పెద్దపులికి పేరంటం చేసినట్లు..
ప్రమాదాలను కొనితెచ్చుకొని, ప్రమాదకారులను గౌరవిస్తూ ప్రమాదంలో పడటం తెలిసో తెలియకో చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పెద్దపులి ఎంతటి క్రూరజంతువో అందరికీ తెలిసిందే. అలాంటి పెద్దపులిని పనిగట్టుకొని పిలిచి పేరంటం చేస్తే ఆ క్రూరజంతువు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరైనా వూహించవచ్చు. అలాంటి సందర్భాలలో 'ఆయనను ఇక్కడకి పిలవటమంటే పెద్దపులిని పిలిచి పేరంటం చేసినట్లే లెక్క. అందుకే ఆయనను పిలవద్దంటున్నాను' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net