Latest posts

  • అల్పబుద్ధివానికధికారమిచ్చిన

    అల్పబుద్ధివానికధికారమిచ్చిన  దొడ్డవారినెల్ల తొలగగొట్టు  చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా  విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యము అల్పుడికి అధికారమిస్తే మంచివారిని పక్కనపెట్టి వంతపాడేవారిని కొలువులో చేర్చుకుంటాడు. చెప్పుతినే కుక్కకు చెరకు తీపి తెలియనట్లే చెడ్డవారికి మంచివారి విలువ తెలియదు.

    Read more

  • అగ్నిబానా మేసి యంబుధి నింకించు

    అగ్నిబానా మేసి యంబుధి నింకించు రాముడవలి కేగ రాక, నిలిచి చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము మహిమతో మహాసముద్రాన్ని ఇంకించిన వారైనా సరే మానవ ప్రయత్నంలో సేతువు కట్టందే ఆ దరి చేరుకోలేరు. పూజవల్ల కాదు, పూనుకవల్ల ఏదైనా నెరవేరుతుంది.

    Read more

  • అనువుగాని చోట అధికుల మనరాదు

    అనువుగాని చోట అధికుల మనరాదు  కొంచెముండుటెల్ల కొదువగాదు  కొండ యద్దమందు కొంచెమై యుండదా  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము అనువుగాని చోట ఎవరూ తమ ఆధిక్యాన్ని చూపడానికి ప్రయత్నించకూడదు. కొద్దిగా తగ్గివున్నా తప్పులేదు. పెద్ద కొండ సైతం అద్దంలో చిన్నది కనిపిస్తుంది. అలాగే సమయం వచ్చే ఆధిక్యాన్ని ప్రదర్శించకుండా ఒదిగి ఉండాలి.

    Read more

  • అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను

    అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను  సజ్జనుండు పలుకు చల్లగాను  కంచు మోగినట్లు కనకంబు మోగునా  విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము అల్పుడెప్పుడు మాట్లాడినా ఆడంబరంగానే ఉంటుంది. అదే సజ్జనుడు మాట్లాడితే చల్లగా నిరాడంబరంగా ఉంటుంది. కంగున మోగి విలువలేని ఇత్తడిలాగా అనవసరమైన హడావిడి చేసేవారు అల్పులు. శబ్దం రాకపోయినా బంగారం లాగా విలువైన వాడు సజ్జనుడు.

    Read more

  • అతిథి రాక చూచి యదలించి పడవైచి

    అతిథి రాక చూచి యదలించి పడవైచి  కఠిన చితులగుచు గానలేరు  కర్మమునకు ముందు ధర్మము గానరో  విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము అతిథి ఇంటికి రాగానే అతనిని అదిలించి పొమ్మని చెప్పిన కఠినచిత్తులు ధర్మమును గుర్తింపరు.ధర్మము చేసిననే కర్మములు నశించగలవు

    Read more

  • అన్నదానమునకు నధిక సంపదగల్గి

    అన్నదానమునకు నధిక సంపదగల్గి  యమరలోక పూజ్యుడగును మీఱు  అన్నమగును బ్రహ్మమది కనలేరయా  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.

    Read more

  • అర్ధ యంకణమున కాధారమైనట్టి

    అర్ధ యంకణమున కాధారమైనట్టి  యొంటిమేడ గుంజు నొనరనిల్పె  నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము దేహం ఒంటి స్తంభపు ఇల్లులాంటిది. దానికి జీవుడు ఒక్కడే యజమాని. కానీ ఇల్లాళ్ళు మాత్రం ఏడుగురు. వారే సప్తప్రకృతులు

    Read more