Latest posts

  • ఇంగలంబు తోడ నిల సల్పుతోడను

    ఇంగలంబు తోడ నిల సల్పుతోడను  పరుని యాలితోడ పతితుతోడ  సరసమాడుటెల్ల చావుకు మూలము  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము నిప్పుతోను, నీచుడితోనూ, పాపాత్ముడితోను, పరస్త్రీ తోనూ పరిహాసమాడడం తన ప్రాణానికి హాని కలిగిస్తుంది.

    Read more

  • ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె

    ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె  జీవబుద్ధి వలన జీవుడయ్యె  మోహబుద్ధిలయము ముందర గనుగొను  విశ్వదాభిరామ వినురమేమ! తాత్పర్యము ఆత్మ అంతా తానే అయినా జీవిస్తూ ఉండడంవల్ల వల్ల జీవుడయ్యాడు. జీవుడికి సహజమైన మోహాలు లోభాలు సహజం. వయస్సు ముదురుతన్న కొద్దీ మోహం ఎక్కువ అవుతుంది.

    Read more

  • ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి

    ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి వేరేపోవువాడు వెర్రివాడు కుక్కతోక పట్టి గోదారీదినా? విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము భార్య మాటలు విని అన్నదమ్ములను ఏవగించుకొని వేరింటి కాపురం పెట్టడం వెర్రితనం. ఇది కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం వంటిది.

    Read more

  • ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు

    ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు  కట్టుపడుచు ముక్తిగానరైరి  జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో  విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ఆలు, కోరికలతో బంధితులైన ప్రజలు మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఈ కోర్కెలను, ఆశలను అణచివేసేందుకు జ్ఞానమనే ఖడ్గం కావాలి. అందుకే జ్ఞానాన్ని అందరూ ఆర్జించాలి.

    Read more

  • ఆశయనెడు దాని గోసివేయగాలేక

    ఆశయనెడు దాని గోసివేయగాలేక  మొహబుద్ది వలన మునుగువారు  కాశివాసులైన గనబోరు మోక్షము  విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ఆశకు లొంగిపోయి అల్లాడేవారు, భోగభాగ్యాల మోహంలో మునిగి తేలేవారు మోక్షాన్ని పొందలేరు. ఇలాంటివారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నివశించినా ముక్తిని పొందలేరు.

    Read more

  • చిక్కియున్నవేళ సింహంబునైనను

    చిక్కియున్నవేళ సింహంబునైనను  బక్క కుక్కయైనా బాధసేయు  బలిమిలేని వేళ పంతములు చెల్లవు  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఎంత గొప్పవాడైనా బలహీనుడైనపుడు అల్పుడికైనా లొంగిపోతాడు. చేజిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా బాధించగలదు కదా!

    Read more

  • చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు

    చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైంది. దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చన్నిదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది.

    Read more

  • చనువారెల్లను జనులం

    చనువారెల్లను జనులం  జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్‌  వినవలె గనవలె మనవలె  నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా తాత్పర్యము చనిపోయిన ఉత్తముల చరిత్రలను శ్రద్ధగా విని, వారివలనే నడుచుకొనుచు ముక్తిని యత్నించవలెను. తయ యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపగూడదు.

    Read more

  • చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే

    చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే  ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప  గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా  విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము మనసు అనెడి వేరు తెగితేనేగాని, మాయ అనెడి వృక్షం నశించదు. అప్పుడే ఆశలనెడి కొమ్మలెండిపోయి ముక్తిని పొందవీలగును.

    Read more

  • అనువుగాని చోట అధికులమనరాదు

    అనువుగాని చోట అధికులమనరాదు  కొంచెముందుటెల్ల కొదువకాదు  కొండ యద్దమందు కొంచమై ఉండదా  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము తగనిచోట తాము గొప్పవారమని చెప్పరాదు. కొంచెం వారైన మాత్రాన హాని లేదు. పెద్దకొండ అద్దంలో చిన్నదిగా కనిపించును కదా.

    Read more