Latest posts
-
పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి బుట్టిరేమి వారు గిట్టరేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా! విశ్వదాభిరామ వినుర వేమా! తాత్పర్యము సక్రమంగా పెంచి పోషించలేని పిసినారులు, ఇతరులకు ఏ మాత్రం సాయం చేయనివారు బతికి ఉన్నా… చచ్చినా ఒక్కటే. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. చస్తూ ఉంటాయి. అవి పుట్టినా, చచ్చినా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు. పిసినారులు కూడా అలాంటి చెదలతోనే సమానం.
-
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల పుట్టి గిట్టలేదె పూర్వులెవరు పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, విశ్వదాభిరామ వినుర వేమా! తాత్పర్యము పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.
-
పరధనంబులకును ప్రాణములిచ్చును
పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమంతలేక జారడగును ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ఈ కాలపు బ్రాహ్మణులు పరుల ధనాన్ని ఆశిస్తున్నారు. ప్రాణాల కంటే దానమే గొప్పదంటున్నారు. జ్ఞానం లేకపోయినా అందరికంటే తామే గొప్ప అని అపోహ పడుతున్నారు.
-
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి పురుషుడవనిలోన పుణ్యమూర్తి పరుల విత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషుల్లో ఉత్తముడు. పరుల సొమ్ము తీసుకున్నా, అది పాపంతో సంపాదించినదే అవుతుంది. అలా చేసేవాడికి ముక్తి ఉండదు.
-
పాల నీటి కలత పరమహంస మెఱుగును
పాల నీటి కలత పరమహంస మెఱుగును నీరు పాలు నెట్లు నేర్చునెమలి లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? విశ్వదాభిరామ వినురమేమా! తాత్పర్యము నీటిలో కలిసి ఉన్న పాలను వేరు వేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పు నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతాకానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడు.
-
పగలుడుగ నాసలుడుగును
పగలుడుగ నాసలుడుగును వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా! తాత్పర్యము విరోధములు నశించిన ఆశలు నశించును. విచారము లేకున్న కోరికలు నశించును. భోగములు నశించిన జన్మములు నశించును. త్రిగుణములు నశించిననే కొని ముక్తి కలుగును.
-
పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ ముఖములందు బంచాక్షరి జనించె పంచ వర్ణములను ప్రబలె జగము పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము శివుడి అయిదు ముఖాల నుంచి పంచాక్షరి వెలువడింది. పంచాక్షరిలోని అయిదు అక్షరాల నుంచి ప్రపంచం పుట్టింది. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడినే స్తుతించాలి.
-
పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె బరగ ప్రపంచము పండువలన బుట్టె పరము నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము భగవంతుడు ప్రకృతి నుంచి జన్మించాడు. భగవంతుడు ఈ లోకాలను సృష్టించాడు. ఇన్ని లోకాలను సృష్టించిన భగవంతుడి గొప్పతనం ప్రహ్లాదుడి వంటి భక్తులు మాత్రమే తెలుసుకోగలిగారు.
-
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు జ్యోతిషము జనముల నీతుల దప్పించు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము జాతకాలు, ముహూర్తాలు, శుభలగ్నాలు మొదలైనవి వేలం వెర్రిగా పిరణమించాయి. న్యాయం అన్యాయమవుతోంది. శాస్త్రోక్తమైన శుభలగ్నాలు పెట్టినా అవి అప్పుడప్పుడు అశుభాలుగానే మారుతున్నాయి.
-
నిజములాడు వాని నిందించు జగమెల్ల
నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచులకడ నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము చెడ్డవారితో నిజం చెప్పకూడదు. వారు నిజం చెబితే నమ్మరు. పైగా నిందిస్తారు. ఉత్తముల దగ్గర మాత్రం కచ్చితంగా నిజాన్నే చెప్పాలి.