Latest posts

  • వెలయాలు సేయు బాసలు

    వెలయాలు సేయు బాసలు వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్ గలలోఁన గన్న కలిమియు, విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ! తాత్పర్యము వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.

    Read more

  • వేసరవు జాతి కానీ

    వేసరవు జాతి కానీ వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ దాసి కొడుకైన గాని కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ! తాత్పర్యము నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి

    Read more

  • హాని కలుగబోదు హరిమది నెంచెడు

    హాని కలుగబోదు హరిమది నెంచెడు  వాని కబ్దు పరము వసుధయందు  పూని నిష్ఠమీరి పొదలక యుండుము  విశ్వరాభిరామ వినురవేమ! తాత్పర్యము భగవంతుడిని మనస్సులో ధ్యానించే వారికి ఎలాంటి హాని జరగదు. అతడికి తప్పక ముక్తి లభిస్తుంది. అందుకే నిష్ఠతో దేవుడిని ధ్యానించి నిశ్చలంగా జీవించాలి.

    Read more

  • శాంతమే జనులను జయమునొందించును

    శాంతమే జనులను జయమునొందించును  శాంతముననె గురువు జాడ తెలియు  శాంత భావ మహిమ జర్చింపలేమయా  విశ్వదాభిరామ వినురవేమ!  తాత్పర్యము శాంత స్వభావం ఉంటే దేనినైనా సాధించవచ్చు. శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు. శాంత గుణం మహిమను వర్ణించలేము.

    Read more

  • వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు

    వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు  చేతకంటె హెచ్చు వ్రాత లేదు  వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త  విశ్వదాభిరామ వినురవేమ!  తాత్పర్యము చేసుకున్న దానికన్నా చిన్నమెత్తు దేవుడు కూడా ఇవ్వలేడు. దీనినే లోకులు బ్రహ్మవాతలంటారు. తల వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త కావచ్చు గానీ, తన చేతకు నరుడు తానే కర్త.

    Read more

  • వేషధారినెపుడు విశ్వసింపగరాదు

    వేషధారినెపుడు విశ్వసింపగరాదు  వేషదోషములొక విధయె యగును  రట్టుకాదె మునుపు రావణు వేషంబు  విశ్వదాభిరామ వినురవేమ!  తాత్పర్యము వేషం వేసి నటించడం కూడా మోసం చేయడమే. అలాంటి వారిని నమ్మకూడదు. రావణుడంతటి గొప్పవాడు కూడా వేషం వేసి సీతను అపహరించి అపకీర్తి పాలయ్యాడు

    Read more

  • వెన్న చేతబట్టి వివరంబు తెలియక

    వెన్న చేతబట్టి వివరంబు తెలియక  ఘృతము కోరునట్టి యతని భండి  తాను దైవమయ్యు దైవంబు దలచును  విశ్వదాభిరామ వినురవేమ!  తాత్పర్యము వెన్నను చేతలో పట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నేతికై బాధపడే వానివలె, జనుడు తనలోనే భగవంతుడున్నాడని తెలుసుకోలేక అతనెక్కడో ఉన్నాడని వెదకుచూ తికమక పడుతుంటాడు.

    Read more

  • వినియు వినకయుండు కనియు గనక యుండు

    వినియు వినకయుండు కనియు గనక యుండు  తలచి తలపకుండు తాను యోగి  మనుజవరులచేత మణిపూజ గొనుచుండు  విశ్వదాభిరామ వినురవేమ!  తాత్పర్యము జ్ఞాని, మోక్ష ధర్మములు వినియు విననట్లును, తత్వమును చూచిచు చూడనట్లును, దేవుని తలచియు తలపనట్లు ఉండును. అట్టి జ్ఞానిని అందరూ పూజిస్తారు.

    Read more

  • లోభమోహములను ప్రాభవములు తప్పు

    లోభమోహములను ప్రాభవములు తప్పు  తలచిన పనులెల్ల తప్పి చనును  తానొకటి దలచిన దైవమొండగుచుండు  విశ్వదాభిరామ వినురవేమ  తాత్పర్యము లోభము, మోహము కలవారికి గొప్పతనము దక్కదు. అట్టివారు తలచిన పనులు జరగవు. తానొకటి తలచిన, దైవమొకటి తలచుననుట ఎరిగినదే కదా!

    Read more

  • లోకమందుబుట్టి లోకమందె పెరిగి

    లోకమందుబుట్టి లోకమందె పెరిగి  లోక విభవమోర్వలేక జనుడు  లోకమందు జనికి లోబడి చెడిపోవును  విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము భూమిమీదే పుట్టి పెరిగి పెద్దయిన మానవుడు భూమిమీద వృద్ధి చెందిన సంపదలకు తాను సృష్టించిన సొమ్ముకు భోగభాగ్యాలకు దాసోహమై చెడిపోతున్నాడు.

    Read more