Latest posts

  • పురికిని బ్రాణము కోమటి

    పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ! తాత్పర్యము ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.

    Read more

  • పుత్రోత్సాహము తండ్రికి

    పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తాత్పర్యము కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

    Read more

  • పులిపాలు దెచ్చిఇచ్చిన

    పులిపాలు దెచ్చిఇచ్చిన నలవడఁగ గుండెగోసి యరచే నిడినం దలపొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ! తాత్పర్యము దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.

    Read more

  • పెట్టిన దినములలోపల

    పెట్టిన దినములలోపల నట్టడవులకైనవచ్చు నానార్థములున్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ! తాత్పర్యము అదృష్టం కలసివచ్చిన రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెన్నాడేటపుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.

    Read more

  • పొరుగున పగవాడుండిన

    పొరుగున పగవాడుండిన నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్ ధరఁగాఁపు కొండెమాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! తాత్పర్యము ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.

    Read more

  • బంగారు కుదువబెట్టకు

    బంగారు కుదువబెట్టకు సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ! తాత్పర్యము బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.

    Read more

  • బలవంతుడ నాకేమని

    బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! తాత్పర్యము నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?

    Read more

  • మండలపతి సముఖంబున

    మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుర సుమతీ! తాత్పర్యము కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.

    Read more

  • మంత్రిగలవాని రాజ్యము

    మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ! తాత్పర్యము సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా ముందుకు సాగవు.

    Read more

  • మాటకు బ్రాణము సత్యము

    మాటకు బ్రాణము సత్యము కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికిఁ బ్రాణము మానము చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! తాత్పర్యము నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.

    Read more