Latest posts

  • పరనారీ సోదరుఁడై

    పరనారీ సోదరుఁడై పరధనముల కాసపడక పరులకు హితుడైఁ పరుల దనుఁబొగడ నెగడక పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ! తాత్పర్యము ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.

    Read more

  • పరసతి కూటమి గోరకు

    పరసతి కూటమి గోరకు పరధనముల కాసపడకు పరునెంచకుమీ సరిగాని గోష్టి సేయకు సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ! తాత్పర్యము ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము.

    Read more

  • పరసతుల గోష్టినుండి

    పరసతుల గోష్టినుండి పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్ బరుసతి సుశీయైనను బరుసంగతినున్న నింద పాలగు సుమతీ! తాత్పర్యము భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును.

    Read more

  • పరుల కనిష్టము సెప్పకు

    పరుల కనిష్టము సెప్పకు పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్ బరుఁగదిసిన సతి గవయకు ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ! తాత్పర్యము ఇతరులకు అప్రియములను పలకవద్దు. పనులు లేక పొరుగిళ్లకు పోవద్దు. ఎప్పుడూ ఇతరులు పొందిన భార్యను కలివవద్దు. తెలిసీ, పొగరుబోతైన గుర్రాన్ని ఎక్కవద్దు.

    Read more

  • పర్వముల సతులఁ గవయకు

    పర్వముల సతులఁ గవయకు ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో గర్వింపనాలి బెంపకు నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ తాత్పర్యము పుణ్యదినాల్లో స్త్రీలతో కలవకుము. ప్రభువుల దయను నమ్మి మనసులో ఉప్పొంగకుము. గర్వంతో విర్రవీగే భార్యను పోషింపకు. సాగుదల లేనిచోట నిలవకు.

    Read more

  • పలుదోమి సేయు విడియము

    పలుదోమి సేయు విడియము తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం బొలయలుక నాటి కూటమి వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!   తాత్పర్యము దంతధావనం చేసుకుని, తలంటు పోసుకుని, తాంబూలం వేసుకుని పోయిన నిద్ర, స్త్రీలతో ప్రణయకలహం వచ్చిన రోజు పొందు అత్యంత సౌఖ్యప్రదాలు. వాటి విలువ ఇంతని చెప్పలేము.

    Read more

  • పాటెరుగని పతికొలువును

    పాటెరుగని పతికొలువును గూటంబున కెరుకపడని కోమలిరతియు జేటెత్తజేయు చెలిమియు నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ తాత్పర్యము శ్రమను తెలుసుకోలేని ప్రభువును సేవించడం, కలయికకు తెలివిలేని స్త్రీతో సంభోగం, వెంటనే చెడిపోయేట్లున్న స్నేహం నదీ ప్రవాహానికి ఎదురీదినట్లే.

    Read more

  • పాలను గలిసిన జలమును

    పాలను గలిసిన జలమును బాలవిధంబుననే యుండుఁ బరికింపగ బాల చవిఁజెరచు గావున బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ! తాత్పర్యము పాలతో కలిసిన నీరు కూడా పైకి పాలలాగే కనపడుతుంది. పరిశీలిస్తే పాల రుచిని చెడగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం స్వగౌరవాన్ని కూడా పోగొట్టును. కనుక అలాంటి స్నేహం వలదు.

    Read more

  • పాలసునకైన యాపద

    పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ! తాత్పర్యము తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.

    Read more

  • పిలువని పనులకు బోవుట

    పిలువని పనులకు బోవుట కలయని సతి రతియు రాజు గానని కొలువు బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ తాత్పర్యము పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.

    Read more