Latest posts

  • తనయూరి తపసితనమును

    తనయూరి తపసితనమును దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్ దన పెరటిచెట్టు మందును మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ! తాత్పర్యము తన ఊరివాళ్ల తపోనిష్ఠ, కుమారుని విద్యాధిక్యత, భార్య సౌందర్యం, ఇంటి వైద్యాలను ఎవ్వరూ కూడా గొప్పగా వర్ణించి చెప్పరు.

    Read more

  • తన కలిమి ఇంద్రభోగము

    తన కలిమి ఇంద్రభోగము తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్ తన చావు జతద్ప్రళయము తను వలచినదియె రంభ తథ్యము సుమతీ! తాత్పర్యము తన ఐశ్వర్యమే దేవలోక వైభవం; తన దారిద్య్రమే సమస్తలోక దారిద్య్రం; తన చావే ప్రపంచానికి ప్రళయం; తాను ప్రేమించినదే రంభ; మనుషులు భావించేది ఈ విధంగానే… ఇది నిజము.

    Read more

  • తనవారు లేనిచోటను

    తనవారు లేనిచోటను జనవించుక లేనిచోట జగడముచోటన్ అనుమానమైన చోటను మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ! తాత్పర్యము కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు.

    Read more

  • తములము వేయని నోరును

    తములము వేయని నోరును విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్ గమలములు లేని కొలకుఁను హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ! తాత్పర్యము తాంబూలం వేయని నోరు, దుర్మార్గులతో స్నేహం చేసి బాధపడే బుద్ధి, తామరపూలు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి శోభిల్లవు.

    Read more

  • తలనుండు విషము ఫణికిని

    తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ దలతోఁక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! తాత్పర్యము పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.

    Read more

  • తలమాసిన నొలుమాసిన

    తలమాసిన నొలుమాసిన వలువలు మాసినను బ్రాన వల్లభునైనం గులకాంతలైన రోఁతురు తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! తాత్పర్యము భూలోకంలో… తలమాసినా, శరీరానికి మురికి పట్టినా, మట్టలు మాసిపోయినా చేసుకొన్న భర్తనయినా ఇల్లాళ్లు ఏవగించుకుంటారు.

    Read more

  • తాను భుజింపని యర్థము

    తాను భుజింపని యర్థము మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ గానల నీఁగల గూర్చిన దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ! తాత్పర్యము అరణ్యంలో తేనెటీగలు కూడబెట్టిన తేనె కడకి తరుల పాలైనట్లు లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం కొంత ప్రభువుల పాలును, మరికొంత భూమి పాలగును.

    Read more

  • దగ్గర కొండెము సెప్పెడు

    దగ్గర కొండెము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా నెగ్గుఁబ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ! తాత్పర్యము మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.

    Read more

  • చేతులకు దొడవు దానము

    చేతులకు దొడవు దానము భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో నీతియ తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ! తాత్పర్యము చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.

    Read more

  • ధనపతి సఖుఁడై యుండియు

    ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్ దనవారి కెంతకల గిన దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ! తాత్పర్యము గొప్ప ధనవంతుడైన కుబేరుడు మిత్రడుగా ఉన్నా శివునికి బిచ్చం ఎత్తవలసి వచ్చింది. కనుక తాను సంపాదించుకున్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయపడాలి గానీ తన దగ్గర ఉన్నవారి దగ్గర ఎంత భాగ్యం ఉన్నా నిష్ప్రయోజనం

    Read more