Latest posts
-
సారంబగు నారికేళ సలిలము భంగిన్
సారంబగు నారికేళ సలిలము భంగిన్ గారవమును మరిమీదట భూరిసుఖావహము నగును భువిలో సుమతీ! తాత్పర్యము బుద్ధిమంతుడికి చేసే మేలు కొబ్బరికాయలోని నీరు వలే శ్రేష్టమైనది, ప్రియమైనది, గొప్ప సుఖానికి స్థానాన్ని ఇచ్చేదీ అగును.
-
నడువకుమీ తెరువొక్కటఁ
నడువకుమీ తెరువొక్కటఁ గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ! తాత్పర్యము తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు. *ధీరులకుఁ జేయు మేలది
-
నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్ నమ్మకు మంగలివానిని నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ! తాత్పర్యము పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, కమసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దు.
-
నవమున బాలుంద్రావరు
నవమున బాలుంద్రావరు భయమునను విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోసకారియె భయమే చూపంగవలయు బాగుగ సుమతీ! తాత్పర్యము మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును.
-
నరపతుల మేరదప్పిన
నరపతుల మేరదప్పిన దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్ గరణము వైదికుఁడయినను మరణాంతకమౌనుగాని మానదు సుమతీ! తాత్పర్యము రాజు హద్దుమీరి ప్రవర్తించినా, శాశ్వతంగా విధవ ఇంట పెత్తందారైనా, లేఖకుడు నియోగి కాక వైదికుడయినా ప్రాణము మీదికి వచ్చును. తథ్యము.
-
నవరస భావాలంకృత
నవరస భావాలంకృత కవితాగోష్ఠియును మధుర గానంబును నవివేకి కెంతఁజెప్పినఁ జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ! తాత్పర్యము తొమ్మిది రసాలతోకూడిన మంచి భావాలతో శృంగారింపబడిన కవిత్వ సంబంధ సంభాషణ, కమ్మని సంగీతాన్ని జ్ఞానహీనునకు వినిపించడం, చెవిటి వాని ముందు శంఖం వూదినట్లే.
-
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ! తాత్పర్యము సభల్లో, తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు.
-
పగవల దెవ్వరితోడను
పగవల దెవ్వరితోడను వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్ దెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిలో సుమతీ! తాత్పర్యము భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదు. దార్రిద్య్రం వచ్చిన తరవాత విచారింపరాదు. సభలో ఎవరినీ దూషింపరాదు. స్త్రీకి తన హృదయాన్ని తెలియనీరాదు.
-
పతికడకుఁ దన్నుగూర్చిన
పతికడకుఁ దన్నుగూర్చిన సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్ సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ! తాత్పర్యము ప్రభువు వద్దకు, భార్య దగ్గరికి, భగవంతుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు బుద్ధిమంతులు వట్టిచేతులతో వెళ్లరు. ఇదియే నీతిమార్గము.
-
పనిచేయునెడల దాసియు
పనిచేయునెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడలఁ దల్లియు ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ! తాత్పర్యము భార్య… ఇంటిపనుల్లో దాసిగా, సంభోగ సమయంలో రంభగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిగా, భోజనం పెట్టే సమయంలో తల్లిగా ప్రవర్తించేలా ఉండాలి.