Latest posts

  • యోగిననుచు గొంత యోగముగూర్చక

    యోగిననుచు గొంత యోగముగూర్చక  జగమునెల్లబట్ట చంపి తినుచు  ధనము కొఱకు వాడు తగవాడుచుండిన  యోగికాడు వాడె యోగువేమ తాత్పర్యము యోగి అని ప్రకటించుకొని అందరినీ పీడించేవాడు ఎన్నటికీ యోగి కాలేడు. డబ్బు కోసం ఇతరులను బాధించేవాడు ఎందుకూ పనికిరానివాడే అవుతాడు.

    Read more

  • భూమిలోన బుట్టు భూసారమెల్లను

    భూమిలోన బుట్టు భూసారమెల్లను  తనువులోన బుట్టు తత్త్వమెల్ల  శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను  విశ్వదాభిరామ వినురవేమ  తాత్పర్యము ఈ ప్రపంచం నుంచే సమస్త చరాచర జీవకోటి జన్మిస్తుంది. మానవుడి ఉనికిలో నుంచే చైతన్యం ఉద్భవిస్తుంది. శ్రమలో నుంచే సర్వం ఉత్పన్నమవుతుంది. శ్రమించనిదే సృష్టిసాగదు. శ్రమంలో నుంచే సంపద వస్తుంది.

    Read more

  • భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

    భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు  దాన హీనుఁ జూచి ధనము నవ్వు  కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును  విశ్వదాభిరామ వినురవేమ  తాత్పర్యము శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది… నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.

    Read more

  • భయమంతయు దేహమునకె

    భయమంతయు దేహమునకె  భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే  లయమంతయు జీవునకే  జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా తాత్పర్యము సంశయం, భయం అన్నీ శరీరానికే. వాటిని విడిచి పెడితే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. లయము పొందేది జీవుడే. ఆత్మ నిత్యమైనది. దానినెప్పుడు విజయం వరిస్తుంటుంది.

    Read more

  • భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

    భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు  దాన హీనుఁ జూచి ధనము నవ్వు  కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది… నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.

    Read more

  • భోగంబుల కాశింపక

    భోగంబుల కాశింపక  రాగద్వేషంబు రంగుడదమలో  వేగమె మోక్ష పదంబును  రాగను నాతండు యోగిరాయుడు వేమా! తాత్పర్యము సుఖముల నాశింపక, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి శ్రీఘ్ర ముగనే ముక్తి కలుగును.

    Read more

  • బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు

    బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు  ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,  ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బు కూడా నిలవదు. ఎన్నిటికైనా మనం చేసిన దానధర్మాలే నిలిచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలి.

    Read more

  • బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి

    బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి  మిత్రచంద్ర శిఖులు నేత్రచయము  మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము బ్రహ్మం అంటే ఏదో తెలియని తత్వం కాదు. మానవ దేహమే బ్రహ్మ స్వరూపం. గాలి ప్రాణం. కళ్లే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మానవుడే బ్రహ్మమని సాధనతో తెలుసుకోవాలి.

    Read more

  • పరులమేలు చూసి పలుకాకి వలె

    పరులమేలు చూసి పలుకాకి వలె  వట్టిమాటలాడు వాడు అధముడు  అట్టివాని బతుకుటదిఏల మంటికా?  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పరుల మేలు చూసి ఓర్వలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలి. అలాకాక అసూయపడేవారి బతుకు నిష్ప్రయోజనం.

    Read more

  • పట్టుపట్టరాదు పట్టివిడువరాదు

    పట్టుపట్టరాదు పట్టివిడువరాదు  పట్టెనేని బిగియ పట్టవలయు  పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అవగాహన లేకుండా ఏ పనీ ప్రారంభించకూడదు. మనం చేసే పని యోగ్యమైందని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వదలకూడదు. మధ్యలో వచ్చే అంతరాయాలకు, అపాయాలకు, ప్రలోభాలకు గురై పట్టువిడవడం కంటే పడి చచ్చిపోవడమే మంచిది.

    Read more