Latest posts

  • పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు

    పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు  వట్టి మాటలాడు వాడధముడు  అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా  విశ్వధాబిరామ వినురవేమ! తాత్పర్యము పరుల మేలు చూసి ఓర్చుకోలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలే తప్ప అసూయపడకూడదు. అలా అసూయపడే వాళ్ల బతుకు నిష్ప్రయోజనం.

    Read more

  • పదుగురాడుమాట పాడియై ధరజెల్లు

    పదుగురాడుమాట పాడియై ధరజెల్లు  నొక్కడాడుమాట యెక్కదెందు  వూరకుండు వాని కూరెల్ల నోపదు  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.

    Read more

  • పరుల దత్తమొప్పి పాలనచేసిన

    పరుల దత్తమొప్పి పాలనచేసిన  నిల స్వదత్తమునకు విను మడియగు  నవని పరుల దత్త మహపరింపగ రాదు  విశ్వధాబిరామ వినురవేమ! తాత్పర్యము పరులు ఇచ్చిన దానాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దానివల్ల తాను ఇచ్చిన దానం కంటే రెండురెట్ల ఫలం దక్కుతుంది. పరుల సొమ్ము అపహరించడం నీచమైన పని.

    Read more

  • పప్పులేని కూడు పరులకోసహ్యమే

    పప్పులేని కూడు పరులకోసహ్యమే  యుప్పులేని వాడె యధిక బలుడు  ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము పప్పులేని భోజనము రుచించదు. అప్పులేని వాడే గొప్పవాడు. భోగాభాగ్యాలపై ఆశలేని వాడే జ్ఞాని.

    Read more

  • పగయుడగు గోపముడిగిన

    పగయుడగు గోపముడిగిన  పగయుడుగన్‌ కోర్కెలుడుగు బరజన్మంపుం  దగులుడుగు భేదముడిగిన  త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా! తాత్పర్యము కోపం నశిస్తే పగ పోతుంది. పగ పోతే కోరికలు ఉండవు. భేదభావాలు లేకపోతే మరో జన్మ లేదు. త్రిగుణాలు నశిస్తే ముక్తి కచ్చితంగా లభిస్తుంది.

    Read more

  • పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు

    పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు  బంగరందు కూర్ప బరువు గనును  గాని యితర లోహమైన హీనము గాదె  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము రత్నాల అందం బంగారు అభరణాల్లో పొదిగితేనే తెలుస్తుంది. ఇతర లోహాల్లో అమర్చితే ఎంతమాత్రం శోభను చేకూర్చదు. మంచివాళ్లకు చెడ్డవారికి కూడా భేదం ఇలాగే ఉంటుంది.

    Read more

  • పదుగురాడుమాట పాడియై ధరజెల్లు

    పదుగురాడుమాట పాడియై ధరజెల్లు  నొక్కడాడుమాట యెక్కదెందు  వూరకుండు వాని కూరెల్ల నోపదు  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.

    Read more

  • పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి

    పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి  బుట్టిరేమి వారు గిట్టరేమి  పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!  విశ్వదాభిరామ వినుర వేమా! తాత్పర్యము సక్రమంగా పెంచి పోషించలేని పిసినారులు, ఇతరులకు ఏ మాత్రం సాయం చేయనివారు బతికి ఉన్నా… చచ్చినా ఒక్కటే. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. చస్తూ ఉంటాయి. అవి పుట్టినా, చచ్చినా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు. పిసినారులు కూడా అలాంటి చెదలతోనే సమానం.

    Read more

  • పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల

    పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల  పుట్టి గిట్టలేదె పూర్వులెవరు  పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,  విశ్వదాభిరామ వినుర వేమా! తాత్పర్యము పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.

    Read more

  • పరధనంబులకును ప్రాణములిచ్చును

    పరధనంబులకును ప్రాణములిచ్చును  సత్యమంతలేక జారడగును  ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు  విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ఈ కాలపు బ్రాహ్మణులు పరుల ధనాన్ని ఆశిస్తున్నారు. ప్రాణాల కంటే దానమే గొప్పదంటున్నారు. జ్ఞానం లేకపోయినా అందరికంటే తామే గొప్ప అని అపోహ పడుతున్నారు.

    Read more