Latest posts
-
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము విలువైన నీలమణి ఒక్కటి చాలు. విలువలేని మెరుగురాళ్లు తట్ట నిండా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అలాగే చెత్త పద్యాలు వేల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేదు. రసవంతమైన పద్యం ఒక్కటైనా చాలు.
-
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది ఎట్లు కలగుబర మదెంతయైన ధనము గలిగియున్న దైవంబు గలుగదు విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము నీతి అనే దీపం సహాయం లేకపోతే అజ్ఞానాంధకారం నశించదు. అది లేకపోతే బ్రహ్మస్వరూపం కనిపించదు. ధనం ఉన్నంత మాత్రాన దైవ కృప ఉండదు.
-
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని కడుపు చల్లజేసి ఘనత విడుచు నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము కన్యాదానం చేసినవారిని, అన్నం పెట్టిన వారిని ఎల్లప్పుడూ గౌరవంతో చూడాలి. వారికి తగిన మర్యాద ఇవ్వనివాడు దుష్టుడితో సమానం.
-
నలుగురు కల చోటను దా
నలుగురు కల చోటను దా దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా దలచెడి యాతడు నిచ్చలు గల మాటలే పలుకుచుండగా దగు వేమా! తాత్పర్యము నలుగురిలో మర్యాదగా తిరగాలనుకునేవాడు ఎల్లప్పుడు యథార్ధాన్నే పలకాలి. అప్పుడే అతన్ని అందరూ గౌరవిస్తారు.
-
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె పలుకవలయుగాని పరులకొరకు చావకూడ దింక నోపదవ్యం పల్క విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము తనకు నిజము తెలిసిఉన్నచో నిజాన్నే చెప్పాలితప్ప అసత్యాన్ని చెప్పరాదు. నిజాన్ని ఎంతమాత్రమూ దాచకూడదు.
-
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు నిజములాడకున్న నీతిదప్పు నిజములాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము వాస్తవాలు, అవాస్తవాలు దేవుడికి తెలుస్తాయి. అందుకే ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నీతిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నిజం చెప్పేవారిని పరమేశ్వర స్వరూపమే అనవచ్చు. నిజాలు చెబితేనే మన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.
-
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు వ్రాతకన్న సాక్షి వలవదన్న పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలకన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది.
-
నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ లింగ జీవావేశులను గాంచి భంగపడక పూజ మదియందు జేరుట పూర్ణపదవి పరము గోరిన నిదిచేయ బాగువేమా తాత్పర్యము ఎన్ని పనులున్నా కూడా క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనస్సుతో లింగజీవాత్మ పరమాత్మను నిశ్చలబుద్ధితో చూచి పూజిస్తే పూర్ణపదవి సిద్ధిస్తుంది. మోక్షం కోరుకునే మానవులకు ఇది అవసరం.
-
నేయి వెన్న కాచి నీడనే యుంచిన
నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టిపడును పెరుగురీతి పోరిపోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము వెన్నను కాచి నేతిగా మార్చి నీడలో ఉంచితో అది పేరుకుంటుంది. పెరుగులా గట్టిపడుతుంది. మనసు అదుపులో ఉన్నట్లే అనిపించినా… ఏమాత్రం ఉపేక్షించినా పట్టు జారిపోయే ప్రమాదం ఉంది.
-
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము పాపవర్తనము, కల్మషం ఉన్నంతవరకు పుణ్యతీర్థాలలో మునిగినా, నిధులపై తిరిగి, వేల్పులకు మ్రొక్కుచున్ననుఉ ఏమి ప్రయోజనము లేదు.