Latest posts

  • కప్పకు నొరగాలైనను

    కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ! తాత్పర్యము కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.

    Read more

  • కమలములు నీడఁ బాసినఁ

    కమలములు నీడఁ బాసినఁ గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్ దమ దమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ! తాత్పర్యము కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.

    Read more

  • కరణము గరణము నమ్మిన

    కరణము గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమీ కరణము తన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ! తాత్పర్యము ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి.

    Read more

  • కరణము సాధై యున్నను

    కరణము సాధై యున్నను గరి మద ముడిగినను బాము కరవకయున్నన్ ధరదేలు మీటకున్నను గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ! తాత్పర్యము కరణం నెమ్మదస్తుడైనా, ఏనుగు మదం పోయినది అయినా, తాచుపాము కరవకున్నా, తేలు కుట్టకున్నా ఆశ్చర్యంతో మిక్కిలి తేలికగా చూస్తారు.

    Read more

  • కసుగాయఁ గరచి చూచిన

    కసుగాయఁ గరచి చూచిన మసలక తన యోగరుగాక మధురంబగునా? పసగలుగు యువతులుండఁగఁ బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ! తాత్పర్యము పక్వానికి వచ్చిన పళ్లను వదిలి పచ్చికాయలను తింటే వగరుగా ఉన్నట్లే, చాతుర్యం గల పడుచులు ఉండగా పసిపాపలను కూడెడు వానికి సుఖము శూన్యము. అలాంటివాడు నిజంగా పశువే.

    Read more

  • కవిగానివాని వ్రాఁతయు

    కవిగానివాని వ్రాఁతయు నవరసభావములు లేని నాతుల వలపుం దవిలి చను పందినేయని వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ! తాత్పర్యము కవి కానివాడు రాసిన రచన, తొమ్మిది రసాల స్థితులు తెలియని స్త్రీ ప్రేమ, ముందుపోయే పందిని వెంబడించి కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనం వ్యర్థం.

    Read more

  • కాదు సుమీ దుస్సంగతి

    కాదు సుమీ దుస్సంగతి పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదుసుమీ యప్పిచ్చుట లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ! తాత్పర్యము చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.

    Read more

  • కాముకుడు దనిసి విడిచిన

    కాముకుడు దనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్ బ్రేమమున జెరకు పిప్పికి జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ! తాత్పర్యము విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన కాంతను మరొకడు జారుడు అనుభవించాలని కోరడం చెరకులోని రసాన్ని సంపూర్ణంగా తీసివేసిన తరవాత పిప్పికై చీమలు ముసుకొన్నట్లు ఉండును.

    Read more

  • కారణములేని నగవును

    కారణములేని నగవును బేరణమును లేని లేమ పృథివీస్థలిలో బూరణము లేని బూరెయు వీరణములేని పెండ్లి వృధరా సుమతీ! తాత్పర్యము కారణం లేని నవ్వు, నృత్యం (రవిక) లేని స్త్రీ, పూర్ణం లేని బూరె, వీరణం లేని పెళ్లి వ్యర్థాలు.

    Read more

  • కొంచెపు నరుసంగతిచే

    కొంచెపు నరుసంగతిచే నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ! తాత్పర్యము చిన్న నల్లి కుడితే… ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి.

    Read more