తెలుగు జాతీయాలు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..

కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

రాజు పగ, తాచు పగ ఒకటేనన్నట్లు

రాజు అంటే ప్రజల మీద సర్వాధికారాలు ఉన్నవాడు. అలాంటి అధికార సంపన్నుడు ఎవరి మీదైనా కోపం తెచ్చుకొని పగబడితే అది తాచుపాము పగలాంటిదేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. తాచుపాము పగపడితే చాలా ప్రమాదమని జన బాహుళ్యంలో ఉన్న నమ్మకం.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

రాఘవా స్వస్తి, రావణా స్వస్తి అన్నట్లు

లోకమంతా శుభకరంగా ఉండాలని కొంతమంది కోరుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

రాగల వసంతాన్ని కాకులు ఆపుతాయా అన్నట్టు..

ఒకరి అదృష్టాన్ని మరొకరు పాడుచేయలేరని అంటారు. అలాంటిదే ఇది. రుతువుల క్రమంలో వసంత రుతువు రావటం, కోయిలలు కూయటం ఇవన్నీ మామూలే. అయితే వసంతంలో కోయిలలు కూస్తాయని అప్పుడు వాటినే అందరూ మెచ్చుకొంటారని కుళ్లుకునే కాకులు వసంతం రాకూడదు, రాకూడదు అంటూ అనుకుంటూ కూర్చున్నాయట.

మూలం/సేకరణ: 
eenadu.net

రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు

జీవిత సత్యాన్ని తెలియచెప్పే జాతీయం ఇది. ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా అలా అనుభవించింటేప్పుడు బంధుమిత్రుల అనురాగం ఉంటేనే ఆ భోగానుభవంలో ఆనందం ఉంటుంది. కానప్పుడు ఎన్ని భోగాలున్నా, ఎదురుగా ఇంకేమున్నా ఆనందమే ఉండదు.

మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు

తలచిన పనులు వెనువెంటనే జరిగిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎంతో దూరాన ఉన్న ఒక దేవాలయంలోని దేవుడికి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని ఓ వ్యక్తి ఆ దేవుడికి మొక్కుకోవాలని సంకల్పించాడట.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

మొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదు

మానవ మనస్తత్వాల విశ్లేషణ చేసే జాతీయాలలో ఇది కూడా ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారు ఎగ్గును లెక్కచేయరు.

మూలం/సేకరణ: 
eenadu.net

మెరుపు దీపమవుతుందా అన్నట్టు

తాత్కాలికమైనవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని లేదా ప్రయోజనాలను చేకూర్చలేవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఆకాశంలో క్షణకాలంపాటు మెరిసే మెరుపులు కాసేపు మంచి కాంతినే ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే మామూలు దీపాలకన్నా ఎక్కువ కాంతినే ఇస్తాయి.

ముమ్మూట అరవై రోగాలకు...

ముమ్మూట అరవై రోగాలకు మూడు గుప్పెళ్ల కరక్కాయ పొడి అన్నట్టు అన్నది జాతీయం. జాతీయాలు జీవితానుభవసారాన్ని నింపుకొని తరతరాలకు చైతన్యదీపికలుగా అందుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఔషధ విలువలను, ఆరోగ్యపరిరక్షణ అంశాలును గురించి తెలియచెప్పేవి కూడా కొన్ని ఉన్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

భోజుడు వంటి రాజు ఉంటే, కాళిదాసులాంటి కవి ఉంటాడన్నట్టు..

పాలకులను బట్టే ప్రజల జీవన విధానం ఉంటుందని తెలియ చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. భోజమహారాజు ప్రజలను చక్కగా పాలిస్తూ కవులను ఆదరించాడు కనుకనే కాళిదాసులాంటి కవి వెలుగు చూడగలిగాడు.

మూలం/సేకరణ: 
eenadu.net

Pages