andhrapradesh

భాగ్యనగరం

భాగ్యనగరంఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం హైదరాబాద్‌. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్‌ షా దీనిని నిర్మించాడు. కుతుబ్‌ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్‌, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్‌ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది.

బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి

బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా

 

పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా

 

తెలంగాణ విమోచనానికి 64 ఏళ్లు

భూమి కోసం... విముక్తి కోసం తెలంగాణా ప్రజలు సాగించిన పోరాటానికి ఫలితం దక్కిన రోజు. భూస్వాముల అరాచకత్వం... నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు.
 

గిడుగు రామమూర్తి పంతులు గారు

గిడుగు రామమూర్తి పంతులు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు.

గిడుగు వెంకట రామమూర్తి (1863-1940):

తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

Subscribe to RSS - andhrapradesh