Latest posts
-
ఫ్రెంచి వాకిట్లో తెలుగు మల్లె చెట్టు
3000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెలుగు బాషని మనం తక్కువ చేసి చూస్తున్న ఈ రోజుల్లో, పరాయి దేశం వారు మన భాషపై పెంచుకుంటున్న మమకారం చూసి మురిసిపోవలా??? లేదా మనం కూడా మన భాషను పరిరక్షించుకోవటానికి అడుగులు వేయాలా?? అన్నది అంధరూ ఆలోచించుకోవాలి. మూలం: ఈనాడు దినపత్రిక
-
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదినం
సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
-
జ్ఞానియైనవాని మానక పూజించు
జ్ఞానియైనవాని మానక పూజించు మనుజుడెప్పుడు పరమునను ముదంబు సుఖమునందుచుండుసూరులు మెచ్చగ విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము జ్ఞానిని గుర్తించి ఎప్పుడు పూజించాలి. పుణ్యాత్ముడు భువిలోను, దివిలోను సమస్త సుఖములను అనుభవిస్తాడు.
-
జన్నములను మరియు జన్నియల ననేక
జన్నములను మరియు జన్నియల ననేక ముల నొనర్చియున్న ఫలముకాన రాక యుండు నీతి లేకున్న మాత్రాన విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము మనిషిలో నీతి లేకుండా ఎన్ని యజ్ఞాలు, వ్రతాలు చేసినా ప్రయోజనం ఉండదు.
-
జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతి, మతము విడిచి చని యోగికామేలు జాతితో నెయున్న నీతివలదె మతముబట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము యోగి కావాలనుకున్నవాడు జాతి, మతాలను విడిచిపెట్టాలి. ఒకవేళ జాతిని ఆశ్రయించినా కూడా నీతిని మాత్రం విడవకూడదు. ఏ జాతివాడైనను దురాచారాలను విడవకపోవడం తప్పు
-
జాలినొందరాదు జవదాటి కనరాదు
జాలినొందరాదు జవదాటి కనరాదు అది మూలమైన ఆత్మమఱుగు పోరిచేరి పొంది పూర్ణము నందురా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము ఆత్మరహస్యమునకుగల మూలతత్త్వమును చూడలేకపోయామని విచారపడినా, యోగనియమములను విడిచినా లాభము లేదు. ఇంద్రియాలను జయించి ఈశ్వరతత్వాన్ని పొందితేనే మేలు.
-
జనన మరణములన స్వప్న సుషుప్తులు
జనన మరణములన స్వప్న సుషుప్తులు జగములందు నెండ జగములుండు నరుడు జగమునంట నడుబాటు కాదొకో విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము చావు పుట్టుకలు స్వప్నాలలోని అవస్థలలాంటివి. ప్రపంచం ఎండమావులలోని నీటిలాంటి మిథ్య, ప్రపంచ భోగాలలో చిక్కుకొని తప్పించుకోలేక అల్లాడడం వివేకవంతులకు అవమానకరం.
-
జాణలమని యంద్రు చపలాత్ములగువారు
జాణలమని యంద్రు చపలాత్ములగువారు తెలివిలేక తమ్ముతెలియలేరు కష్టమైన యడవి గాసీలుచున్నారు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ప్రజలు తమను తాము తెలివిగలవారమనుకుంటారు. తమలోని అజ్ఞానాన్ని గ్రహించరు. తమను తాము తెలుసుకోలేని వారు తపస్సు చేసినా సరైన ప్రయోజనాన్ని పొందక, సారాన్ని గ్రహించలేక అడవుల్లో నివసిస్తూ పలు కష్టాలపాలవుతుంటారు.
-
జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటినందు రిమ్మరేచునపుడు రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము జ్ఞానం గురువులాంటిది. జ్ఞానం లేకపోతే బుద్ధి అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య భ్రమిస్తుంటుంది. ఈ భ్రమలకు అడ్డుకట్ట వేస్తేనే మోక్షం లభిస్తుంది
-
గంగి గోవుపాలు గరిటడైనను చాలు
గంగి గోవుపాలు గరిటడైనను చాలు కడవెడైనను నేమి ఖరముపాలు భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆవుపాలు కొంచమైనా చాలు గాడిదపాలు కుండనిండా ఉన్నా ప్రయోజనం లేదు. ప్రేమతో పెట్టిన తిండి కొంచమైనా తృప్తి ఇస్తుంది. తిడుతూ ఎంత పెట్టినా తృప్తి ఉండదు.