తెలుగు జాతీయాలు

అప్పు లేకపోతే ఉప్పుగంజైనా మేలు

అప్పు తీసుకోవడం దాన్ని తీర్చలేక కష్టాలపాలు కావటం మంచిది కాదని హెచ్చరించే సందర్భాలలో పెద్దలు ఉదహరించే జాతీయమిది. అప్పు చేసి పప్పుకూడు తిని ఆ తర్వాత అందరితోనూ అవమానాలు పొందేకన్నా తాను సొంతంగా సంపాదించుకున్న ఉప్పు వేసిన గంజైనా ఎంతో గొప్పదంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి

పూర్వకాలం నాటి పెద్దలు అనవసరంగా అప్పులు చేయవద్దని పిల్లలను హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అప్పు నిప్పు అని కూడా అంటుంటారు. అప్పుంటే ముప్పు అని చెబుతుంటారు.

అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు...

అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు అన్నది జాతీయం. ఈ జాతీయం తెలుగువారి ఆచార వ్యవహారాలు, నమ్మకాల ఆధారంగా అవతరించింది. చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని భావిస్తారు. అది వారి నమ్మకం.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం వూడిపోయినట్టు

మేలు జరుగుతుందని ఆశపడినప్పుడు అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడ్డ సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట.

అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు

సమాజంలో నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానిస్తుంటారు కొందరు.

అనిత్యాని శరీరాణి.. అందరి సొమ్మూ మనకేరాని..

మనిషిలోని బలహీనతలను, మోసగుణాలను వెక్కిరించే జాతీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వ్యంగ్యంమాటున చురుకు పుట్టించే అలాంటి జాతీయాలలో ఇదొకటి. కొంతమంది ఎదుటివారికి విపరీతంగా నీతులు చెబుతుంటారు. తత్వోపదేశం చేస్తుంటారు. వారు మాత్రం అందుకు భిన్నంగా స్వార్థంతో ప్రవర్తిస్తుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

అదును చూసి పొదలో చల్లినా పండుతుందన్నట్టు

సమయ సందర్భాలను, సమయస్ఫూర్తిని పాటించినప్పుడే ఎవరికైనా విజయం దక్కుతుందనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. సక్రమంగా వర్షాలు కురిసే నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి.

మూలం/సేకరణ: 
eenadu.net

అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..

సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది.

మూలం/సేకరణ: 
eenadu.net

అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..

సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది.

మూలం/సేకరణ: 
eenadu.net

అతిచేస్తే మతి చెడుతుందన్నట్టు

ఏ పనైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. హద్దులను పాటించాలి. అలా కాకపోతే అన్నీ అనర్థాలేనని హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సంస్కృతంలో కూడా అతి సర్వత్రా వర్జయేత్‌ అనే సూక్తి ఉంది.

Pages