పదుగురాడుమాట పాడియై ధరజెల్లు నొక్కడాడుమాట యెక్కదెందు వూరకుండు వాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమ!
పప్పులేని కూడు పరులకోసహ్యమే యుప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా విశ్వదాభిరామ వినురవేమ!
పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమంతలేక జారడగును ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు విశ్వదాభిరామ వినురవేమా!
పరుల దత్తమొప్పి పాలనచేసిన నిల స్వదత్తమునకు విను మడియగు నవని పరుల దత్త మహపరింపగ రాదు విశ్వధాబిరామ వినురవేమ!
పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు వట్టి మాటలాడు వాడధముడు అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా విశ్వధాబిరామ వినురవేమ!
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి పురుషుడవనిలోన పుణ్యమూర్తి పరుల విత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమా!
పరులమేలు చూసి పలుకాకి వలె వట్టిమాటలాడు వాడు అధముడు అట్టివాని బతుకుటదిఏల మంటికా? విశ్వదాభిరామ వినురవేమ
పాల నీటి కలత పరమహంస మెఱుగును నీరు పాలు నెట్లు నేర్చునెమలి లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? విశ్వదాభిరామ వినురమేమా!
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల పుట్టి గిట్టలేదె పూర్వులెవరు పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, విశ్వదాభిరామ వినుర వేమా!
పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి బుట్టిరేమి వారు గిట్టరేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా! విశ్వదాభిరామ వినుర వేమా!